India vs Australia 2019: Matthew Hayden Made Intrusive Remarks On Hardhik Pandya | Oneindia Telugu

2019-02-20 95

Speaking about the latest series, Matthew Hayden said, "Australia All-rounder Marcus Stoenis was a great player compared to Pandya.''
#indiavsaustralia
#australiainindia
#matthewhayden
#chahal
#hardhikpandya
#marcusstoenis
#viratkohli
#shikardhawan
#patcummins
#glennmaxwell

ప్రపంచ క్రికెట్ లో కవ్వింపు చర్యలకు పెట్టింది పేరు ఆసీస్ . అయితే ఈ నెల 24 నుంచి ఇండియా తో రెండు టీ 20 లు , ఐదు వన్డేలు ఆడనున్నది. తాజా సిరీస్ గురించి మాథ్యూ హెడెన్ మాట్లాడుతూ..ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సుదీర్ఘ సిరీస్‌లో విరాట్ కోహ్లీని మూడు సార్లు ఔట్ చేసిన యువ ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌‌‌కి ఈసారి అంత సులువుగా వికెట్ దక్కబోదని మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. అదే సమయం లో ఆసీస్ తో కోహ్లీ సేన కు ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరిస్తున్నాడు. అంతటి తో ఆగకుండా ఆసీస్ అల్ రౌండర్ మార్కస్‌ స్టోయినిస్‌ ను పాండ్యా తో పోల్చుతూ పాండ్యా కంటే స్టోయినిసే గొప్ప ఆటగాడంటూ వ్యాఖ్యానించాడు.

పాండ్యా ఇంకా చాలా నేర్చు కోవాలని పరిస్థితులకు తాగుతూ ఆడటం పాండ్యాకు ఇంకా అలవడలేదని " వ్యాఖ్యానించాడు. అలాగే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కు ఆసీస్‌ స్టార్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌తో ఇబ్బందులు తప్పవని ఈ ఆసీస్‌ మాజీ దిగ్గజ ఆటగాడు హెచ్చరించాడు. కమిన్స్‌ తన వైవిద్య బంతులతో ధవన్‌ను బోల్తా కొట్టిస్తాడనన్నాడు. స్వింగ్ , షార్ట్ పిచ్ బంతులు ఎలా ఆడాలో ధావన్ తెలుసుకోవాలని ఈ మాజీ ఆటగాడు చెప్పుకొచ్చాడు.